అమ్మి
సనం..
ఎన్ని సార్లు ...అలిగానో
అమ్మ కడుపులో పడ్డప్పటి నించి
ఇందాకటి వరకు ...అమ్మ మీద
నా స్వంత ఊపిరితో
పుణ్యక్షెత్రాలు
సుందరవనాలు
లోయలు ...సరస్సులు ఎన్ని ఉండి
ఇక్కడ ఎంతకాలాం బ్రతికినా
నాకు మా అమ్మ కడుపులోని శాంతి లేదు గా
తొమ్మిది నెలలు నేను అనుభవించిన ఆ జీవితం
నీ ప్రేమ మళ్ళీ నాకు ఇవ్వగలదా?
నాకో కొత్త జీవితం ఇచ్చేందుకు
అమ్మ పడిన ప్రసవ వేదన కన్నా ఎక్కువగా
తపనతో ....నా జీవితాన్ని మరో సారి మార్చగలవా?
లాలించో ...
కోప్పడో...
పది పైసలు ఇచ్చో...
ముద్దలు చేసి తినిపిస్తూ నో...
ఎన్ని రకాల సుత్తులు ... మేకులు
ఉపయోగించి..
నన్నిలా చెక్కుకుంటూ వస్తుందమ్మా..
ప్రతి సారి ..బుధ్ధి చచ్చి నప్పుడు
ఎన్ని రకాలుగా అసహ్యించుకుంటూ
దొరక్కుండ ఆమేకు దూరంగా వేళ్తున్నా
అంతకు రెట్టింపు శక్తి తో
నన్ను దగ్గరకు తీసుకోని లాలించడం చేసె
మా అమ్మ కన్నా ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించగలవా?
ప్రతి సారి.........
తప్పు నాదే ..........
చెంప నాదే ........వీపు నాదే.....
అయినా, ఎన్నడూ అమ్మ నన్ను
ఒంటరిగా వదిలి వెయ్యాలని చూడలేదు
ఎదురు తిట్టి ..అలిగింది నేనే అయినా
నా కోసం ప్రతి మూల వెతుకుతది
నువ్వెక్కడైనా...ఎప్పుడైనా నా కోసమలా వెతికావా?
వాడే నా వద్దకు వస్తాడని
ఇలా - నీలా - పట్టించుకోకుండా మౌనంగా కూర్చోలేదు !!!
నా జుట్టు పట్టుకోని
చెంపలు - వీపుని వాయించే హక్కుని
మా అమ్మ నుంచి తీసుకో గలవా?
తర్వాత
ప్రపంచాన్నే కాల్చెయ్యాలన్నంత కసిగా
ఏదో మూల ఒంటరిగా కూర్చోని ఏడ్చేటపుడు
మళ్ళీ నువ్వే వచ్చి
నన్ను నీ బాహువుల్లో లాక్కోని
నా జుట్టుని సరిదిద్దుతు
పిప్పర్మెంట్లు ఇస్తావా?
డాలర్ వద్దు
దినార్ వద్దు
హైటెక్ సిటి అంతస్థులో ఆ ఏ సి గది లో
ఆ కుర్చి వద్దు ...
ప్రతీ క్షణం అమ్మను చూసుకుంటూ
ఇంటిముందు సైకిల్ రిపేర్ చేసె మస్తాన్
పాన్ లు కట్టుకోనే ఫరీద్ లు ఎంత అదృష్టవంతులు
మక్కా మసీదులో ఎంత సేపు
ప్రార్ధనలు చేశామో ?
తాజ్ మహాల్ ని చూసుకుంటు ఎంతకాలం
గడిపామో ? లెక్కలు చూసుకునే వాళ్ళలాగా
నాకు మా అమ్మ నీడలో క్షణాలు
ఎన్నైనా తక్కువే
నువ్వు మక్కా మసీదు , తాజ్ మహల్ గోపురాల కలయికగా
వచ్చే కొత్త గోపురానివి అవుతావా?
రూపాయి సంపాదన లేక
తనకేం నేను ఖర్చు పెట్టే స్థితిలో...
ఖాళీ జేబు తో ఉన్నప్పుడు ...
సిగరేట్స్ , చాయ్ లు డ్రింక్స్ ల తో
ఏ సిన్మా హాలులు..... ఏ పార్కుల లోను .......ఏ పెద్ద రెస్టారెంటులలోను
దొరకని బేస్ట్ ఫ్రెండ్ లా
నాతో ముచ్చట్లు పేట్టే మా అమ్మ కన్నా
బేస్ట్ ఫ్రెండ్ గా మారే ధైర్యం నీకుందా ?
లేకుంటే నువ్వు - నా అమ్మవి కాలేవు
నువ్వు నా ప్రియురాలివి కాలేవు.
Wednesday, 30 September 2009
Subscribe to:
Post Comments (Atom)

1 comment:
Chaala baagundi mee kavitha.Good.
Post a Comment