Sunday, 30 November 2008

జాతియ జేండాకు అత్తరు పూస్తాం.

జాతియ జేండాకు అత్తరు పూస్తాం.

ఎన్ని దర్గా ల దగ్గర
ఎన్ని మన్నత్ లు చేసి
ఎన్ని జేండాలు లేపినా..
జిందగీల్లో.. దలీంద్రాగిలు పొవట్లే...

రంజాన్ ఉపవాసాలు...
బక్రీద్ ఖుర్బానీలు
ముస్లింల జీవితాలు.
ప్రార్ధనాలయం క్యాపిటల్ టర్నొవర్... పోటీల్లో..
మసీదులు వేనకబడే...ఉంటాయి.

నవాబు ఏవడో...బిర్యానిలు తిన్నాడని..
మా ఆకలికి అంటరానితనాన్ని..
నూరి పోస్తున్నరు.

ఏర్రకొట వద్ద..
జాతీయ జేండకి..ఉర్సు చేద్దాం రండి.

బొన్సాయ్ వృక్షాల్లా..మార్చి వేసి
దారిద్ర్యం లొ ఇరికేల రాసిన
సిద్ధంతమే... రాజ్యాంగం ల ఉంది

రాజ్యం చేసిన అబార్షన్లనే..
రిజర్వేషన్లంటారని ..తేలుస్తుంది.

ప్రతిజ్ఞ ఒ భ్రమలా...
జాతీయ గీతం తో నే.. త్రుప్తిపడుతున్నాం.

నా దేశం తారతమ్యాలు చూడని
పవిత్రమసీదు
దాన్ని ప్రైవేటు లిమిటెడ్
దుకాణం చేసారు
.
పాతబడి.. చినిగిన దుస్తులతో...
ఆకలితో శుష్కించిన శరీరాన్ని...
బురఖాతో..కప్పుకొని ప్రపంచం ముందుకొచ్చిన
పేదపిల్ల నూర్జహాన్ ల..
ఈ దేశం దేహం మీద
జాతీయ జెండా.. ఒ బుర్ఖా..

బేడీలు....... కారాగారాలు.... లేకుండా విధించే..
శిక్షలు ఏమిటో...
ఈ స్వాతంత్ర్య దేశం లో... లో
ఏ తప్పు చెయ్యకున్న..అనుభవిస్తున్నాం.

మేము పౌరులమే కదా.
భరతమాత ముద్దు బిడ్డలమే..కదా..
చనుపాలు ఇవ్వలేని తల్లి
డబ్బా పాలైనా..ఇస్తుంది కదా?

అంతా..సమానమే అంటూనే..
కత్తి మొనలాంటి..ఓ విభజన దేశంలో..
అన్ని అర్హతలు ఉండికూడా..
అసలైన అంటరానివాళ్ళలా..
స్వాతంత్ర్య... హింసని ....
హక్కు లా.. అనుభవిస్తున్న అమాయకులం

బ్యాంకు గడపల్లో...
అంతా ఏక్కి దిగుతుంటే..
బుర్ఖాలన్ని వాటిముందునించి
దర్గాలకు వెళ్ళి వస్తున్నాయి.

దొసిళ్ళలో...దువాలే...డిపాజిట్ లు.
అర్థం కాని ఖురానే పేద్ద పాస్ బుక్ .
అరబ్బి చదువులతో...
అయిదు పూటల ఫర్జ్ నమాజులు
చదివిన చదవక పొయిన
ఈ ప్రపంచం లొ చచ్చే వరకైనా.. బ్రతకగలం

కానీ,
చచ్చే వరకైన బ్రతకడానికైనా..
కనీసం వృత్తి.. చదువులైన చదివించు.

నమాజులు చదివించే మాస్టరు
ఉద్యొగం వృత్తి.. విద్య కాదుగా..
అరబ్బి సర్టిఫికేట్ ని ఏ ఏంప్లాయ్ మెంట్. ఆఫీసు
గుర్తించలేదుగా.

ఆలయ నిర్వహణ అధికారి లాంటి పొస్ట్ లేమి
మసీదులకు దర్గాలకు లేవుగ..?

మా బాధ్యత మేము సరిగానే నిర్వహిస్తున్నాం..
దేశమే.. తన బాధ్యత మరిచింది

స్పేస్ షటిల్ లొ వెళ్ళి..
పరిశొధనలు చేసె సత్తా..ఉన్నా..
.స్పేషల్ షటిల్ ఆటో..సర్వీసు డ్రైవర్లు గా... ..బతకమన్నవ్.

పాన్ షాపో..
సైకిల్షాపో..
టైలర్ షాపో..
ఏదొ ఓ దరిద్రపు బతుక్కి..
కనీసం రుణం... కూడ.. స్వేచ్చగా.. ఇవ్వవు.
ఒక ప్రతిభను చూపే అవకాశం.. ఎక్కడిస్తావ్?
అసూయ పరుడివి నువ్వు.

ఒక్క అవకాశం ఇచ్చి చూడు...సరిగా.
అమేరికా "బిక్షాం దేహి" అనేలా..
సౌది కన్నా..మించి సంపదలు సౄస్టిస్తాం

శస్త్ర సాంకేతిక రంగాల్లో...సత్త చాటుతాం.
ప్రక్కనున్న శత్రుదేశాలన్ని ఉచ్చపొసుకొనేలా..
దేశాన్ని రచ్చన గేలిపిస్తాం .
సాధిస్తాం.
దునియలో...ఇండియా..ని
అవ్వల్ నంబర్ లో.... నిలుపుతాం
నారే తక్బీర్ అల్లహూక్బర్ కి ఖసం
హం హొంగే కామియాబ్.

No comments: