Sunday, 30 November 2008

ఉగ్రవాది

ఏవరు ఉగ్రవాదొ….ఏవరు..నేను…నమ్మిన నా భారతీయుడొ అర్థం కావడం లేదు.
ఖురానుబైబిల్భగవద్గీత లను….కాదు..
నా రాజ్యాంగాన్ని….విశ్వసించే వాడెవడూ కనిపించడం లేదు.
రాజకియాల కొసం….మా మరాఠ లొ రావద్దనిమనుషుల్ని చంపే ఒకడు…
మా…ఈశాన్య దెశం లొ రావద్దని.మనుషుల్ని చంపే ఒకడు…..
మా దెగ్గర హింది మాట్లాడొద్దని..మనుషుల్ని చంపే ఒకడు
…ఇలపైన స్వర్గసీమ ని నరకం గా మార్చుతూఈ కాశ్మీరం నాది అని మనుషుల్ని చంపే ఒకడు…
రాజ్యంగం మత స్వేచ్చ ఇచ్చినా కాని…చర్చులు…మసీదులు ..కూల్చుతూమనుషుల్ని చంపే ఒకడు…
ఏందుకు పుడుతాడో…ఏలా పుడుతాడో….మానవ బాంబుగా వచ్చిమనుషుల్ని చంపే … ఉగ్రవాది ఒకడు…
తమిల ఉగ్రవాది అని ఒకడుహిందు ఉగ్రవాది అని ఒకడుముస్లిం ఉగ్రవాది అని ఒకడు..నాగ ఉగ్రవాది అని ఒకడు..కాశ్మీర్ ముజహిదిన్ అని ఒకదుకాశ్మీర్ ,బిహార్, నుంచి….దక్షిణ భారతం వరకు..అదుగడుగున…రాజకీయాల పేరిట…ద్వేషాలు అసహ్యాలు పంచుతూ..
పేర్ల పక్కన అణు బాంబుల్లాంటి…కులాలతొ రాజ్యధికరానికి…రధయాత్రలు…విజయాత్రలు చేస్తూ…
ఇండియ అభివృధ్ధి కావద్దు అనే..అమెరిక వాడి కలపాకిస్తానొడి ఆశయాలకు …ఇలా. మనం బలాన్నిస్తున్నతకాలం…
ఇంతే…
క్విట్ పొలిటీషీయన్స్ …మాకు ఈ ముసలి పంచెలు అక్కరలేదు.ఈ గుంటనక్కల బుజ్జగింపులు అక్కరలేదు…
స్వాతంత్రం వచ్చిన కొత్తలో..గాంధి ని రక్షించుకొలేక పొయాం.
భగత్సింగులమై కనీసం ఇప్పుడు …గాంధి ఇజాన్ని…రక్షించుకుందాం.
గాంధి ఇజాన్ని ఏవడైతే…అసహ్యించుకుంటాడోవాడే…ఉగ్రవాదాని కి అసలైన జాతిపిత..

No comments: