బిస్మిల్లహ్
ఏ ప్రార్ధన
ఏ ఉపవాసం
ఏక్కడా అగర్బత్తీలు
కొబరికాయలు కొట్టకుండానే
జన్మించబడ్డం.
అలాగే మరణించ బడ్తాం.
ఆహరం తీసుకొవడం ఏలాగో..
శ్వాస తీసుకొవడం ఏలాగో...
తేలియని తొమ్మిది నెలలు..
సమస్తం అందించబడినట్లే...
మన జీవితం లో...
ఓ అదౄశ్య..ప్రేగు ద్వార...
మనకు ప్రసాదించబడినవి..సమస్తం
సమకూర్చబడుతాయి.
అసలయిన జీవితానికి ప్రసవమార్గం...
మరణం.
ఈ ప్రపంచమే ఒక గర్భసంచి.
Saturday, 22 November 2008
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment